తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత - కర్ణాటక, బెంగళూరు సమీపంలో 500 కేజీల గంజాయి పట్టివేత

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో 500 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

500 kg of marijuana seized
500 కేజీల గంజాయి పట్టివేత

By

Published : Mar 27, 2021, 7:11 AM IST

కర్ణాటక, బెంగళూరు జిల్లాలోని ఆర్​కే పురం పోలీసు స్టేషన్​ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి తరలిస్తూ అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

500 కిలోల గంజాయి ఉన్న లారీని పట్టుకున్న పోలీసులు

మారువేషంలో..

నిందితులను పట్టుకున్న పోలీసులు

రాజస్థాన్​ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. మారువేషంలో గంజాయి వినియోగదారులుగా నిందితులను కలిశారు. అనంతరం, లారీని సీజ్​ చేసి తనిఖీ చేయగా.. ఎలాంటి మాదకద్రవ్యాలు దొరకలేదు. నిందితులను ప్రశ్నించగా.. లారీ డ్రైవర్​ క్యాబిన్​ వెనుకభాగంలో 500 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మత్తుమందు ఇచ్చి బాలికపై తాంత్రికుడు అత్యాచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details