తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెల్లవారినీ వదలని ఆంగ్లేయులు.. తొలి పత్రికకు సంకెళ్లు! - బెంగాలీ గజెట్​

తమను వ్యతిరేకిస్తే భారతీయులనే కాదు.. తోటి తెల్లవారిని సైతం ఆంగ్లేయులు వదల్లేదు! అలాంటి కథే దేశంలో తొలి వార్తాపత్రిక బెంగాల్‌ గెజిట్‌ స్థాపకుడు జేమ్స్‌ అగస్టస్‌ హికీది.

azadi ka amrit mahotsav
తెల్లవారినీ వదలని అంగ్లేయులు.. తొలి పత్రికకు సంకెళ్లు!

By

Published : Oct 24, 2021, 8:50 AM IST

ఈస్టిండియా కంపెనీ భారత్‌పై పట్టు సంపాదించేనాటికి.. ఇంగ్లాండ్‌లో చాలామంది జీవితం దుర్భరంగా గడిచేది. ప్రజల్లో బోలెడంత అంతరాలు! సగటు బ్రిటిష్‌ పౌరుడి ఏడాది సంపాదన 17 పౌండ్లు మాత్రమే! అదే భారత్‌లో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి సంపాదన ఏడాదికి 800 పౌండ్లు. అందుకే ఆ సమయంలో చాలామంది యూరోపియన్లు భారత్‌కు వచ్చి తమ తలరాతలు మార్చుకోవటానికి తహతహలాడారు. అలా వచ్చిన వారిలో ఒకరు జేమ్స్‌ అగస్టస్‌ హికీ.

తమ నాగరికతను రుద్దే క్రమంలో ముద్రణను కీలకంగా భావించింది ఈస్టిండియా కంపెనీ. అందుకే ప్రింటింగ్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించింది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ కార్యకలాపాల ముద్రణ కోసం బెంగాల్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టారు హికీ. కానీ చివరి నిమిషంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏమీ పాలుపోని హికీ ముద్రణ యంత్రాలతో 1780లో భారత్‌లో తొలి వార్తాపత్రిక - హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌ను ఆరంభించారు. అనుకోకుండా ఆరంభమైన ఈ పత్రిక అనూహ్యంగా విజయవంతమైంది. తొలుత రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినా పరిస్థితులు ఆ దిశగానే పత్రికను తీసుకెళ్లాయి. బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా వారెన్‌ హేస్టింగ్స్‌ అధికారం చెలాయిస్తున్న రోజులవి. తన పట్టు బిగించే యత్నంలో హేస్టింగ్స్‌ తనవారికే ఉన్నత పదవులు కట్టబెట్టారు. బెంగాల్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులు కూడా. అన్ని విభాగాల్లోనూ బోలెడంత అవినీతి మొదలైంది. ఇవన్నీ చూస్తూ ఉండలేకపోయారు హికీ. ప్రభుత్వ వ్యతిరేక, అవినీతి వ్యతిరేక వార్తలు పత్రికలో మొదలయ్యాయి. హేస్టింగ్స్‌తోపాటు, ఆయన సహచరుల అవినీతి వార్తలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఎదురుదాడి చేయటం ఆరంభించింది. తొలుత ప్రభుత్వానికి బాకా ఊదే పత్రికను ఒకదాన్ని హికీ పత్రికకు పోటీగా పెట్టారు. రెండో దశలో హికీపైనా, ఆయన పత్రికపైనా పరువునష్టం కేసులు దాఖలు చేశారు. ఇందులో చాలా వాటిని హికీ ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. అయినా ఆయన్ను వెంటాడి మరీ అరెస్టు చేసిది హేస్టింగ్స్‌ ప్రభుత్వం. ఆరంభించిన రెండేళ్లలోనే భారత తొలి పత్రిక మూతపడేలా చేసింది. హికీ అత్యంత పేదరికంలో మరణించాల్సి వచ్చింది.

ఇదీ చూడండి:-జాతీయోద్యమంలో 'చాయ్​' పాత్ర గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details