తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో తప్పిపోయి కశ్మీర్​లో ప్రత్యక్షం.. పదేళ్ల తర్వాత కుటుంబం చెంతకు మహిళ.. - పదేళ్ల తరువాత కుటుంబ సభ్యులను కలిసుకున్న మహిళ

అనుకోకుండా కుటుంబ సభ్యుల నుంచి దూరమైన ఓ మహిళ.. పదేళ్ల తరువాత కుటుంబ సభ్యులను కలుసుకుంది. మైనర్​గా​ ఉనప్పుడు బంగాల్​లో తప్పిపోయిన బాధితురాలు.. పదేళ్ల అనంతరం కశ్మీర్​లో వివాహం చేసుకుని స్థిరపడింది. ఇన్నేళ్లకు తిరిగి కుటుంబ సభ్యులకు చేరువైంది.

bengal-woman-reunited-with-family-after-ten-years-in-kashmir
పదేళ్ల తరువాత కుటుంబ సభ్యులను కలిసుకున్న మహిళ

By

Published : Jun 18, 2023, 8:08 PM IST

పదేళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి అనుకోకుండా దూరమైన ఓ మహిళ ఎట్టకేలకు.. వారిని కలుసుకుంది. బంగాల్​కు చెందిన ఆ మహిళ.. టీనేజ్​లో ఉన్నప్పుడు తప్పిపోయింది. అనంతరం కశ్మీర్​కు చెందిన యువకుడిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. ఎట్టకేలకు ఇన్నేళ్లకు తిరిగి కుటుంబ సభ్యులను చేరుకుంది. అందుకు జాతీయ మహిళా కమిషన్​, పోలీసులు, బంగాల్​ రేడియో క్లబ్​ సాయం అందించింది. ప్రస్తుతం ముగ్గురి పిల్లలకు తల్లిగా ఉన్న ఆ మహిళ.. శనివారం బారాముల్లాలో ఉన్న తన పుట్టింటివారిని కలుసుకుంది.

కొంత కాలం క్రితం ఆ మహిళ తన బావ సహాయంతో జాతీయ మహిళ కమిషన్​ను సంప్రదించింది. చాలా రోజులుగా తన కుటుంబానికి దూరంగా ఉన్నానని.. ఎలాగైన వారి చెంతకు తనును చేర్చాలని కమిషన్​కు విజ్ఞప్తి చేసింది. ​తాను బంగాల్​లోని సుందర్​బన్స్​ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా చెప్పుకుంది. జయనగర్​లో రైల్వే స్టేషన్ సమీపంలో తన ఇళ్లు ఉండేదని తెలిపింది. తప్పిపోయిన మహిళ విజ్ఞప్తితో.. దాదాపు నెల రోజుల క్రితం బంగాల్​ పోలీసులను సంప్రదించింది మహిళా కమిషన్​. బాధిత మహిళ కుటుంబాన్ని వెతికి పనిలో పడ్డ పోలీసులు.. బంగాల్​ రేడియో క్లబ్​ సాయంతో బాధితురాలి కుటుంబ ఆచూకీ కనుగొన్నారు. అనంతరం ఆ మహిళ సమాచారాన్ని వారికి చేరవేశారు.

"బాధితురాలి కుటుంబం కుల్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దెయుల్‌బరి గ్రామంలో ఉన్నట్లు బరుయ్​పుర్​​ మహిళా పోలీస్​ స్టేషన్​ నుంచి మాకు సమాచారం అందింది. దీంతో వారి ఆచూకీని గుర్తించాం." అని బంగాల్​ రేడియో క్లబ్​ సెక్రటరీ అంబరీష్ నాగ్ బిస్వాస్ తెలిపారు. విసృతమైన రేడియో క్లబ్​ నెట్​వర్క్​, పోలీసుల సహకారంతో.. బాధితురాలి కుటుంబాన్ని గుర్తించగలిగినట్లు అతడు పేర్కొన్నారు. బంగాల్ ఉంటున్న బాధితురాలి కుటుంబం.. జూన్​ 14న కశ్మీర్​కు వెళ్లింది. పది సంవత్సరాల తరువాత శనివారం ఆ మహిళలను కలుసుకున్నారు. పోలీసు సిబ్బంది డబ్బు విరాళంగా ఇచ్చి, మహిళ కుటుంబానికి రైలు టిక్కెట్లు కొనుగోలు చేసి.. వారి బిడ్డను కలుసుకోవడానికి సాయం అందించారని కుల్తాలి స్టేషన్ అధికారి తెలిపారు.

మొదట్లో ఆమెతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టంగా ఉండేదని పోలీసులు తెలిపారు. మమ్మల్ని ఆమె అపరిచితులుగా భావించి.. మాతో మాట్లాడేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో రేడియో క్లబ్ సభ్యులు.. స్థానికంగా ఉన్న ఓ ఎన్​జీఓ ప్రతినిధిని ఆమె ఇంటికి పంపించారని వివరించారు. అప్పటి నుంచి ఆమెను సంప్రదించడం మాకు సులభంగా మారిందని తెలిపారు. చాలా రోజులు గడిచిన కారణంగా ఆమె తన మాతృభాష మర్చిపోయిందని.. బెంగాలి మాట్లాడలేకపోతుందని రేడియో క్లబ్​ మెంబర్​ తెలిపాడు. ట్రాన్స్​లేటర్​ సాయంతో కాన్ఫరెన్స్​ కాల్​ను మాట్లాడించినట్లు అతడు వెల్లడించాడు. ఆ మహిళ భర్త ఆరోగ్య శాఖ పనిచేస్తున్నాడు. ఆమె బావ టూరిజం బిజినెస్​ చేస్తున్నాడు. కశ్మీర్​లో​ మహిళ పెళ్లి అయిన తరువాత ఆమెను కలువడం వీలుకాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

పదేళ్ల క్రితం బాధితురాలిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు ఆమె బంధువు. అనంతరం ఆమెను ఎక్కడో విడిచిపెట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బాధితురాలి కుటుంబం.. బంధువుపైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో అతన్ని ఎవ్వరు ప్రశ్నించలేకపోయారు. కొన్ని సార్లు అడిగే ప్రయత్నం చేసినప్పటికి.. అతడు సరైన సమాధానం చెప్పేవాడు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి గురించి ఆమె కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్​లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇన్నేళ్ల పాటు ఆ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎందుకు ప్రయత్నాలు చేయలేదో మాకు సృష్టమైన సమాచారం లేదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details