భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై బంగాల్లో దాడి జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం ఒకరి హోదా తగ్గించగా.. మరొకరికి పదోన్నతి కల్పించింది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అదికారులను బదిలీ చేయగా.. 13 మందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
డైమండ్ హార్బర్ జిల్లా ఎస్పీ భోలనాథ్ పాండే హోదాను తగ్గించి.. హోమ్ గార్డ్ ఎస్పీగా నియమించింది. దక్షిణ బంగాల్ ఐజీగా ఉన్న రాజీవ్ మిశ్రాకు పదోన్నతి కల్పించి అదే జోన్‌కు అదనపు డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఘటన సమయంలో విధుల్లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రెసిడెన్సీ రేంజి డీఐజీగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.