తెలంగాణ

telangana

బంగాల్‌లో ముగ్గురు ఎన్నికల అధికారుల బదిలీ

By

Published : Apr 8, 2021, 5:55 AM IST

బంగాల్​లో ముగ్గురు ఎన్నికల అధికారులు బదిలీ అయ్యారు. వారి బదులు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. కోల్‌కతాలోని 8 నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులనూ తొలగించింది.

EC transfers 3 district magistrates
ఎన్నికల అధికారుల బదిలీ

బంగాల్‌లో ముగ్గురు జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను బదిలీ చేస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వారికి ఎన్నికలకు సంబంధించిన విధులు ఇవ్వకూడదని సూచించింది. దక్షిణ దినాజ్‌పుర్‌, పూర్బ బర్ధమాన్‌, పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాల ఎన్నికల అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఆదేశించింది. వారి బదులు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను నియమించింది.

8 నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల తొలగింపు

కోల్‌కతాలోని 8 నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను ఎన్నికల సంఘం తొలగించి కొత్తవారిని నియమించింది. ఇది సాధారణంగా జరిగే వ్యవహారమేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. వారు ఈ పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉంటున్నందున బదిలీ చేసినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:మమత బెనర్జీకి ఈసీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details