తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ - టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

బంగాల్​లో మూడోదశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆరంబాగ్​లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

Bengal polls: Clash erupts between TMC and BJP supporters in Arambagh
బంగాల్​లో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

By

Published : Apr 6, 2021, 1:54 PM IST

బంగాల్​లో మూడోదశ పోలింగ్ నేపథ్యంలో ఆరంబాగ్​లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మహిళా ఓటర్లను భాజపా కార్యకర్తలు బెదిరిస్తున్నారని, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరంబాగ్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుజాత మోండల్​ ఆరోపించారు.

టీఎంసీ, భాజపా కార్యకర్తల ఘర్షణ
కర్రలతో వెంబడిస్తున్న ఇరు వర్గాలు
ఘర్షణ ప్రాంతంలో బలగాలు
ఆరంబాగ్​ తృణమూల్​ అభ్యర్థి

" అరంది-ఐ ప్రాంతంలో మమతా బెనర్జీని అభిమానించే మైనారిటీ ఓటర్లు ఉన్నారు. భాజపా కార్యకర్తలు గత రాత్రి మహిళా ఓటర్లను వేధించారు. వారితో అసభ్యంగా ప్రవర్తించారు. బటనాల్​లోని 45వ పోలింగ్​ కేంద్రంలో ఓటర్లు తృణమూల్​ కాంగ్రెస్​కు ఓటేస్తే భాజపాకు వెళ్తోంది. హింసతో భాజపా గెలవాలని చూస్తోంది. "

-- సుజాత మోండల్ ఖాన్, ఆరంబాగ్ టీఎంసీ అభ్యర్థి

సీఆర్పీఎఫ్ బలగాలు సైతం భాజపాకు మద్దతుగా వ్యవహరిస్తున్నాయని సుజాత ఆరోపించారు.

బంగాల్​ మూడో దశ ఎన్నికల్లో భాగంగా 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది.

ఇదీ చదవండి :అసెంబ్లీ ఎన్నికలు: జోరుగా పోలింగ్​- ఓటేస్తున్న ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details