తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్: మధ్యాహ్నం 1.30 వరకు 55 శాతం పోలింగ్​

బంగాల్​లో ఐదో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్న వేళ మధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, కామర్హతిలో ఓ భాజపా పోలింగ్​ ఏజెంట్ హఠాన్మరణం కలకలం రేపింది.

By

Published : Apr 17, 2021, 1:58 PM IST

bengal poll
బంగాల్ పోలింగ్

బంగాల్​ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

బూత్ తెరవకముందే క్యూ కట్టిన ఓటర్లు

ఇటీవల నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా కూచ్‌బిహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్

గాల్లోకి కాల్పులు..

ఉత్తర పరగణాల జిల్లా దేగంగలోని కురల్​గచ్చాలో పోలింగ్​ బూత్​ వద్ద గుమిగూడిన జనాన్ని చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అంతకుముందు వారిపై లాఠీఛార్జీ చేసినట్ల పోలీసులు తెలిపారు. దీనిపై వివరణకు ఆదేశించింది ఎన్నికల సంఘం.

వికలాంగునికి సహాయం చేస్తున్న భద్రతా దళాలు

భాజపా బూత్‌ ఏజెంట్‌ హఠాన్మరణం

కమర్హతీ ప్రాంతంలోని 107వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో భాజపా ఏజెంట్‌ హఠాత్తుగా మృతి చెందడం కలకలం సృష్టించింది. దీంతో అతడి మృతిపై నివేదిక సమర్పించాలని ఈసీ.. ఎన్నికల సిబ్బందిని ఆదేశించింది.

ఉత్తర వర్దమాన్‌ అసెంబ్లీ పరిధిలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తమ బూత్‌ ఏజెంట్లపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది.

పలు చోట్ల సీఆర్పీఎఫ్‌ జవాన్లు పోలింగ్‌ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని టీఎంసీ ఆరోపించింది.

బూత్​ వద్ద బారులు తీరిన ఓటర్లు

ఇదీ చూడండి:లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!

ABOUT THE AUTHOR

...view details