కరోనా వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పడానికి భూమి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
'భూమి ఇస్తాం.. టీకా కేంద్రాలు నెలకొల్పండి' - బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం భూమి ఇస్తుందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
మమతా బెనర్జీ
దేశంలో తగినంత టీకాలను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న సంస్థలకు తగిన సామర్థ్యం లేదని.. విదేశీ సంస్థలను వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని కోరారు. అంతేకాకుండా వ్యాక్సిన్ల సరఫరా పారదర్శకంగా చేయాలని తెలిపారు.