బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య మరోసారి తీవ్ర వివాదం చెలరేగింది. గవర్నర్ అవినీతిపరుడని ఆరోపించారు మమత. 1996 నాటి హవాలా కేసులో ఆయన నిందితుడని చెప్పారు. ధన్కర్ ఇటీవల ఉత్తర బంగాల్ పర్యటన ఎందుకు చేశారో తెలపాలని డిమాండ్ చేసిన మమత.. ఆ ప్రాంతాన్ని విడదీసే కుట్ర జరుగుతోందని అన్నారు.
"జగదీప్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 హవాలా జైన్ కేసు ఛార్జిషీట్లో ఆయన పేరుంది. శిక్ష నుంచి కోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించిన తర్వాత.. ఈ వ్యవహారానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు ఉంది. ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది? భాజపా అవినీతి పార్టీ. అది అవినీతిపరులకు ఆశ్రయమిస్తుంది."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
బంగాల్‌ను విడదీసే కుట్ర..
ధన్కర్ ఉత్తర బంగాల్ పర్యటన పొలిటికల్ స్టంట్ అని మమత అన్నారు. ఎందుకంటే అక్కడ ఆయన కేవలం భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలనే కలిశారని చెప్పారు. "అకస్మాత్తుగా ఉత్తర బంగాల్‌కు గవర్నర్ ఎందుకు వెళ్లారు? ఉత్తర బంగాల్‌ను విడదీసే కుట్ర జరుగుతోందని నాకు అనుమానంగా ఉంది." అని మమత ఆరోపించారు. ధన్కర్ను తొలగించడానికి కేంద్రానికి ఎన్నోసార్లు లేఖ రాసినట్లు తెలిపారు.
నాపై ఎలాంటి ఛార్జిషీట్ లేదు..