తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంకుల్​ జీ' కామెంట్​కు గవర్నర్​ స్ట్రాంగ్​ కౌంటర్ - jagdeep dhankhar vs mamata banerjee

తృణమూల్ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యలపై బంగాల్​ గవర్నర్​ స్పందించారు. ఎంపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

bengal governer jagdeep dhankar, బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్
తృణమూల్​ ఎంపీ వ్యాఖ్యలపై బంగాల్​ గవర్నర్​ స్పందన

By

Published : Jun 7, 2021, 3:45 PM IST

బంగాల్‌ రాజ్‌భవన్‌ మొత్తాన్ని గవర్నర్ కుటుంబీకులు, పరిచయస్తులతో నింపేశారన్న తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు. వారు తన కుటుంబ సభ్యులు కాదని, వివిధ రాష్ట్రాలకు చెందినవారని వివరణ ఇచ్చారు.

"తృణమూల్​ నేత మహువా మొయిత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు. ఎంపీ ఆరోపిస్తున్న వారంతా మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఏ ఒక్కరూ నా కుటుంబానికి సన్నిహితులు కారు. ఈ ఆరుగురికీ నా కులంతో కానీ, రాష్ట్రంతో కానీ సంబంధం లేదు. ప్రస్తుతం బంగాల్​లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న వేళ ఈ పరిస్థితుల నుంచి దారి మళ్లించేందుకే తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా బాధ్యతను నిర్వర్తిస్తాను."

-జగ్​దీప్​ ధన్​కర్, బంగాల్​ గవర్నర్​

మెయిత్రా స్పందన..

గవర్నర్​ వ్యాఖ్యలపై ఎంపీ మహువా మొయిత్రి స్పందించారు.

"గవర్నర్​ వద్ద స్పెషల్​ డ్యూటీ చేస్తున్న అధికారులది సామాన్య పదవి కాదు. రాజ్​భవన్​ వెబ్​సైట్​లో అధికారుల జాబితాలో చూపిస్తున్న షెకావత్​, దీక్షిత్​, ధన్​కర్​ ఎవరు? వీరితో ఎలాంటి సంబంధం లేదని గవర్నర్​ అబద్ధం చెప్తున్నారు. ఈ ఆరుగురు అధికారులు రాజ్​భవన్​లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై గవర్నర్​ వివరణ ఇవ్వాలి."

-మహువా మొయిత్రి

అంతకుముందు.. బంగాల్ రాజ్‌ భవన్ ప్రత్యేక విధుల్లో.. ఆరుగురు అధికారులను తన కుటుంబసభ్యులు, పరిచయస్తులతో గవర్నర్ ధన్‌కర్‌ నింపేశారని.. ఎంపీ మహువా మొయిత్రి ఆరోపించారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్​ను అంకుల్ జీఅంటూ సంబోధించిన ఎంపీ ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇదీ చదవండి :బంగాల్, ఒడిశాలో కేంద్ర మంత్రుల పర్యటన

ABOUT THE AUTHOR

...view details