తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డ్​​.. కానీ!

Conquers Mount Everest Without Oxygen Cylinder: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా బంగాల్​కు చెందిన పియాలీ బసక్​ రికార్డు సృష్టించారు. అయితే అందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని మాత్రం ఆమె పొందలేకపోయారు. అందుకు ఆర్థిక ఇబ్బందులే కారణం.

Conquers Mount Everest Without Oxygen Cylinder
Conquers Mount Everest Without Oxygen Cylinder

By

Published : May 22, 2022, 7:16 PM IST

Conquers Mount Everest Without Oxygen Cylinder: బంగాల్​లోని చందన్‌నగర్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్(31).. ఆక్సిజన్ సిలిండర్ సహాయం లేకుండా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు పియాలీ ఈ ఘనత సాధించి తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. అందుకోసం ఆమె గత కొంత కాలంగా నిరంతర సాధన చేస్తున్నారు. ఎవరెస్ట్‌ అధిరోహించడానికి రిహార్సల్‌గా ప్రపంచంలోని ఏడో ఎత్తైన శిఖరమైన ధౌలగిరిని.. ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పియాలీ జయించారు.

ఎవరెస్ట్​ శిఖరంపై పియాలీ బసక్​

అయితే, ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్​ పర్వతాన్ని జయించడానికి కొద్ది రోజుల క్రితం బేస్ క్యాంపు నుంచి ఆమె ఒక వీడియో షేర్​ చేశారు. అందులో రూ.12 లక్షలు డిపాజిట్ చేయలేక ఎవరెస్ట్‌ను జయించాలన్న తన కల ఆగిపోయే ఛాన్స్​ ఉందని బాధపడ్డారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ఎవరెస్ట్, లోటస్‌ను జయించడమే తన లక్ష్యమని అన్నారు. "అయితే, ఈ రెండు శిఖరాలను జయించడానికి అయ్యే మొత్తం ఖర్చు రూ.35 లక్షలు. ఇందులో 12 లక్షల రూపాయలు ఏజెన్సీలో జమ చేయాల్సి ఉంది. అది చేయకపోతే ఎవరెస్ట్‌ను జయించినందుకు గుర్తింపు లభించదు" అని పియాలీ వాపోయారు. ఇటువంటి స్థితిలో బంగాల్​లోని చందన్‌నగర్‌ రోటరీ క్లబ్‌ సభ్యులు పియాలీకి అండగా నిలిచారు. డిపాజిట్​ చేయాల్సిన డబ్బును సేకరించి ఇస్తామని హామీ ఇచ్చారు. పియాలీ డిపాజిట్​ చేయాల్సిన సొమ్ముకోసం రోటరీ క్లబ్​ సభ్యులు సేకరిస్తున్నారు.

ఎవరెస్ట్​ శిఖరంపై పియాలీ బసక్​

మరోవైపు పియాలీ సాధించిన విజయం పట్ల ఆమె తల్లి సప్నా బసక్ సంతోషం వ్యక్తం చేశారు. " పియాలీ పడిన కష్టాన్ని నా కళ్లారా చూశాను. అందుకే ఆమె సాధించిన విజయం పట్ల గర్విస్తున్నాను"అని తెలిపారు. అయితే పియాలీ సాధించిన ఈ విజయంలో ఆమె తండ్రి పాలుపంచుకోలేకపోతున్నారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:రైళ్లలో ఆర్​టీసీ బస్సుల రవాణా.. చరిత్రలోనే తొలిసారి..!

బీటెక్​తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలకుపైనే!

ABOUT THE AUTHOR

...view details