బంగాల్‌లో చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 35 శాసనసభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుండగా.. 283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 84 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం సున్నితమైన ప్రాంతంగా గుర్తించిన బిర్భూమ్ జిల్లాలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. కరోనా ఉద్ధృతి వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.