బంగాల్లో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు దుండగులు ఆయన్ను తీవ్రంగా అవమానించారు. చెప్పులు, బూట్లు, చీపుర్లను ఆయన వెళుతున్న మార్గంలో వేలాడదీశారు.
లావ్పుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి భాజపా తరఫున బిశ్వజిత్ సాహర్ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సోమదంగా దస్పరకు వెళ్లారు. అయితే ఆయన వెళుతున్న దారిలో కొందరు చెప్పులు, చీపుర్లను వేలాడదీశారు.