బంగాల్లో భాజపాను అధికారంలోకి రానివ్వకండి అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఇలా శాంతియుతంగానే ఉండాలన్నారు. కోల్కతాలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దీదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"బంగాల్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. భాజపాకు అధికారం పొందే అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడమని నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా భాజపాకు సవాల్ విసురుతున్నాను. మీరు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కూడా తీసుకోండి, తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మీ ప్రయత్నాలను నేను అడ్డుకుంటాను."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి