Mamata blocked Jagdeep Dhankhar: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా ట్విట్టర్లో ఆమె ధనకర్ను బ్లాక్ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ బెదిరిస్తున్నారని కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు మమత.
ధన్కర్ను బంగాల్ గవర్నర్గా తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని మమత తెలిపారు. చర్యలు తీసుకునే సూచనలే కన్పించడం లేదన్నారు.
మమతకు, ధన్కర్కు తొలి నుంచి పడటం లేదు. ఇద్దరూ తరచూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటారు.