కరోనా కారణంగా ఎందరో నిరుద్యోగులయ్యారు. అలాంటివారిలో బంగాల్‌కు చెందిన పార్థా మండల్ ఒకరు. దుబాయ్‌లో షెఫ్‌గా పనిచేసిన మండల్.. మహమ్మారి కారణంగా ఉద్యోగం పోవడం వల్ల స్వస్థలానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో వినూత్నంగా ఆలోచించాడు. మొబైల్ రెస్టారెంట్‌కు రూపకల్పన చేశాడు.
ఎలా ఉంటుంది?..
తూర్పు వర్ధమాన్ జిల్లా మెమారీకి చెందిన మండల్.. ఓ ట్రక్కును రెస్టారెంట్లా మార్చివేశాడు. రెండు అంతస్తులుగా తీర్చిదిద్దాడు. మొదటిది వంట గదిలా మార్చాడు. పై అంతస్తును డైనింగ్ హాల్లా చేశాడు. మెట్ల సహాయంతో కస్టమర్లు చేరుకునే సదుపాయం కల్పించాడు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఇందులో ఒకేసారి 50 మంది తినేలా ఏర్పాట్లు చేశాడు.
"నేను మొదటిసారి ఈ రెస్టారెంట్‌కు వచ్చా. ఇది చాలా ప్రత్యేకమైనది. ఆహారం చాలా రుచిగా ఉంది. కస్టమర్లను మర్యాదగా చూసుకుంటున్నారు. నా స్నేహితులతో చాలా ఎంజాయ్ చేశాను."