తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేతాజీ జయంతి.. భాజపా, టీఎంసీ వర్గాల ఘర్షణ.. రాళ్లు రువ్విన దుండగులు - భాజపా ఎంపీ అర్జున్ సింగ్

BJP TMC clash in Bengal: నేతాజీ జయంతి సందర్భంగా బంగాల్​లో భాజపా, టీఎంసీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. నేతాజీ జయంతి కార్యక్రమంలో భాజపా ఎంపీ పాల్గొన్న సమయంలో కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అంతకుముందు.. శనివారం రాత్రి టీఎంసీ పార్టీ కార్యాలయంపై నాటు బాంబు దాడి జరిగింది.

BENGAL BJP TMC CLASH
BENGAL BJP TMC CLASH

By

Published : Jan 23, 2022, 1:31 PM IST

బంగాల్​లో ఘర్షణ

BJP TMC clash Bengal: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బంగాల్​లో భాజపా, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శనివారం ఉదయం బైరక్​పుర్ ఎంపీ, భాజపా నేత అర్జున్ సింగ్.. కోల్​కతా సమీపంలోని భాట్​పాడాలో నిర్వహించిన నేతాజీ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత.. హింసకు దారితీసిందని చెప్పారు.

Netaji Jayanti Bengal clashes

ఈ ఘటనలో ఓ పోలీసు వాహనం సహా రెండు కార్లు ధ్వంసమయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఎంపీ అర్జున్ సింగ్​ను సురక్షితంగా ఆయన నివాసానికి తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలిలో మోహరించారు. సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఘర్షణకు దిగిన ఓ వ్యక్తి.. తుపాకీ గురిపెట్టిన గార్డు

మరోవైపు, శనివారం రాత్రి దగ్గర్లోని టీఎంసీ పార్టీ కార్యాలయంపై దుండగులు నాటుబాంబులు విసిరారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో భాజపా, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని చెప్పారు. ఈ రెండు ఘటనలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:నేతాజీకి కోవింద్, మోదీ నివాళులు.. సెలవు ప్రకటించాలన్న దీదీ

ABOUT THE AUTHOR

...view details