తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్, అసోం రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెర - అసెంబ్లీ ఎన్నికలు 2021

బంగాల్​, అసోం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. బంగాల్​లో 30, అసోంలో 39 స్థానాలకు ఏప్రిల్​ 1న పోలింగ్ జరగనుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, భాజాపా నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్​లో పోరు రసవత్తరంగా మారిన తరుణంలో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది.

BENGAL elections, ASSAM second phase
బంగాల్, అసోం రెండో దశ ఎన్నికలు

By

Published : Mar 30, 2021, 5:01 PM IST

ఏప్రిల్​ 1న జరగనున్న బంగాల్, అసోం రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారంతో ప్రచార గడువు ముగిసింది. అసోంలో 39, బంగాల్​లో 30 స్థానాలకు గురువారం ఓటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.

రెండో దశలో భాగంగా బంగాల్​లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్​పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి.

బంగాల్​లో​ ప్రభుత్వ ఏర్పాటుకు రెండో దశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. ఈ దశలో 30 స్థానాలకుగానూ 171మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152 మంది పురుషులు కాగా, 19 మంది మహిళలు.

ఇదీ చూడండి: బంగాల్​లో 8 దశల్లో పోలింగ్​- మే 2న ఫలితం

అసోంలో 39 స్థానాలు..

అసోం రెండో దశలో 39 స్థానాలకు ఏకంగా 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 26 మంది మహిళలు. రెండో విడతలో మొత్తం 73,44,631 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుష ఓటర్లు 37,34,537, మహిళా ఓటర్లు 36,09,959 మంది. 135 మంది ఇతరులున్నారు.

రెండో దశ చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు అసోంలో ర్యాలీలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 'కేంద్రం అసలు వైఖరి వారికి అర్థమైంది'

ABOUT THE AUTHOR

...view details