తేయాకు తోటలో పనికి వెళ్లిన వారిపై పిడుగులు (Lightning Strike) పడ్డాయి. బంగాల్ జల్పాయిగుడి జిల్లాలోని దైనా తేయాకు తోటల్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో 24 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
సోమవారం సాయంత్రం జరిగిన ఒక ఘటనలో 17 మంది మహిళలు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని స్థానికంగా ఉండే మాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలీలు తేయాకులు తీస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు టీ గార్డెన్ మెడికల్ ఆఫీసర్ ఎంకే సోనీ తెలిపారు.