'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్'ను (పీఎండీహెచ్ఎం) (Pm Digital Health Mission)ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) సోమవారం ప్రారంభించారు. వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దేశంలో మరో ముందడుగు పడిందని, ఈ పథకం ద్వారా విప్లవాత్మక మార్పులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు(ndhm health id). కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి సంబంధించిన వివరాలు..
అసలేంటి ఈ పథకం?
పీఎండీహెచ్ఎంలో నాలుగు భాగాలుంటాయి. హెల్త్ ఐడీ(ndhm id card), ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ నూతన పథకంతో రోగుల వివరాలను వైద్యులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. చెక్అప్లు, స్క్రీనింగ్‌లు సమయానికి చేయించుకుంటున్నారా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు. బీపీ, మధుమేహం వంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేయవచ్చు.
ఆరోగ్య సంరక్షణ రంగానికి 'డిజిటల్' రూపాన్ని ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. టెలీమెడిసిన్, ఈ-ఫార్ససీస్ను రానున్న కాలంలో ఈ పథకానికి అనుసంధానం చేయనున్నారు.
ఈ హెల్త్ ఐడీకి 14 అంకెల ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఐడీ కోసం ప్రాథమిక వివరాలు, ఆరోగ్యపరమైన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ లేదా, ఫోన్ నంబర్ ద్వారా హెల్త్ ఐడీ సృష్టించుకోవచ్చు. ఈ మొత్తాన్ని పర్సనల్ హెల్త్ రికార్డ్ సిస్టమ్(పీహెచ్ఆర్)గా పరిగణిస్తారు. ఆరోగ్యపరమైన వివరాలను ఎప్పకిప్పుడు అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
లాభాలేంటి?
- ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాలంటే చాలా బరువు మోయాల్సి వస్తోంది. ప్రతి చోటుకు రిపోర్టులు తీసుకెళ్లాలి. ఈ హెల్త్ ఐడీతో అన్నీ ఒక్క చోటుకు చేరినట్టు అవుతుంది. వ్యాధులు, వాటి కోసం చేయించుకున్న వైద్య పరీక్షలు, వాటి రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు వంటి వివరాలన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒక వేళ వైద్యుడిని మార్చినా, ఇతర ప్రదేశాలకు వెళ్లి స్థిరపడాల్సి వచ్చినా.. ఆరోగ్యపరమైన వివరాలన్నీ పోర్టబుల్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్య డేటాను విశ్లేషించేందుకు సులభమవుతుంది. తద్వారా ఆరోగ్యపరంగా మెరుగైన ప్రణాళికలు రచించేందుకు, నిధులు కేటాయించేందుకు, రాష్ట్రాలవ్యాప్తంగా ఆరోగ్య పథకాలను అమలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- ఆరోగ్య సేవలో సమర్థత, పారదర్శకత ఈ పథకం ద్వారా మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుందని ధీమాగా ఉంది.
ప్రజల డేటా, వ్యక్తిగత గోప్యతకు భద్రత కలిపిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది.
పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని గతేడాదే మొదలుపెట్టింది ప్రభుత్వం. అండమాన్ నికోబార్, ఛండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దమన్ దయూ, లద్దాఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో తొలుత అమలు చేశారు. మోదీ ప్రారంభించడం వల్ల సోమవారం ఇది అధికారికంగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఇదీ చూడండి:-'2024 నాటికి భారత్‌లో 1000మందికి ఒక వైద్యుడు'