భర్త తనను కొట్టాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు చాలానే చూసి ఉంటాం. అయితే బిహార్ గోపాల్‌గంజ్‌లో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. భార్య తనను రోటీ కర్రతో కొట్టిందని.. ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి.. భార్య తనను కొట్టిన రోటీ కర్రను కూడా సాక్ష్యంగా తీసుకెళ్లాడు. బాధితుడు శశికుమార్ సిద్వాలియా రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో శశికుమార్.. పిల్లల విషయంలో తన భార్యతో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తలపై కొట్టిందని భార్యపై ఫిర్యాదు.. సాక్ష్యంగా రోటీ కర్ర తెచ్చిన భర్త - రోటీ కర్రతో పోలీసు స్టేషన్‌కెళ్లిన భర్త న్యూస్
భార్య తన తలపై రోటీ కర్రతో కొట్టిందని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. ఈ ఘటన బిహార్ గోపాల్‌గంజ్‌లో జరిగింది. అయితే.. తన భార్య దాడికి ఉపయోగించిన రోటీ కర్రను కూడా సాక్ష్యంగా తీసుకెళ్లాడు బాధితుడు.
దీంతో కోపోద్రిక్తురాలైన అతని భార్య రోటీ కర్రతో శశికుమార్ తలపైన కొట్టింది. దీంతో ఆ వ్యక్తి తలపై తీవ్ర గాయమైంది. వెంటనే మహిళా పోలీసు స్టేషన్‌కు చేరుకున్న శశికుమార్.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "నేను ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నా. నేను ఇంటి నుంచి బయలుదేరుతుండగా.. నా భార్యతో నాకు గొడవ జరిగింది. ఆమె నా తలపై రోటీ కర్రతో కొట్టడం వల్ల నా తలకు గాయమైంది" అని బాధితుడు పోలీసులతో చెప్పాడు. రోటీ కర్రను పోలీసులకు చూపించాడు.
'ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషన్‌కు రావాలని మేం దంపతులను పిలిచాం' అని పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఫ్సా ప్రవీణ్ తెలిపారు.