తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్​ నోటిఫికేషన్​.. 400కుపైగా ఖాళీలు.. రూ.55 వేల శాలరీ!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్​)లో 428 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టులతో బీఈఎల్ జారీ చేసిన ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

BEL Recruitment 2023
BEL Recruitment 2023

By

Published : May 12, 2023, 8:01 AM IST

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. బీఈఎల్ రిక్రూట్‌మెంట్- 2023 పేరుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 428 ప్రాజెక్ట్, ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 18వ తేదీతోతో దరఖాస్తుల పర్వం ముగియనుంది. నవరత్న విభాగానికి చెందిన ఈ భారత దేశపు ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బెంగళూరులోని కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న 428 పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు..

  • మొత్తం- 428 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు-327
  • ట్రైనీ ఇంజినీర్ పోస్టులు- 101

ప్రాజెక్ట్ ఇంజినీర్ 327 పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్-164, మెకానికల్-106, కంప్యూటర్ సైన్స్ -47, ఎలక్ట్రికల్-07, కెమికల్-1, ఎరో‌స్పేస్ ఇంజినీరింగ్-2 ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్ పోస్టులలో ఎలక్ట్రానిక్స్-10, ఎరోస్పేస్ ఇంజినీరింగ్ పోస్టులు 1 ఉన్నాయి.

అర్హతలు ఇవే..
ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు సంబంధిత విభాగంలో ఏదైనా యూనివర్సిటీ, కళాశాల నుంచి బీఈ, బీటెక్, బీఎస్సీ(4 సంత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది.

వయో పరిమితి..
ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 32 సంత్సరాల లోపు, ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు 23 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 4 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్​లైన్​లో ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మే 18వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు వివరాలు..
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400తో పాటు 18 శాతం జీఎస్టీ, ట్రైనీ ఇంజినీర్ దరఖాస్తుకు రూ.150తో పాటు 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బ్యాంకుకు వెళ్లి ఫీజు చెల్లించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
మీ వివరాలు అన్నీ ఎంటర్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకసారి మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశముంది. దీంతో ఏమైనా తప్పులు ఉంటే మళ్లీ సరిచేసుకోవడానికి కుదరదు. అందుకే సబ్మిట్ ఆప్షన్ ఎంచుకునే ముందు వివరాలను ఒకసారి మళ్లీ చూసుకోవడం మంచిది.

ఎంపిక విధానం..
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తొలుత 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హులైన వారికి 15 మార్కులకు ఇంటర్వ్యూ జరుపుతారు. ఇంటర్వ్యూలో మెరిట్ సాధించినవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
గౌరవ వేతనం..
ప్రాజెక్ట్ ఇంజినీర్-1 ఉద్యోగులకు మొదటి సంవత్సరం రూ.40 వేలు, రెండో సంవత్సరం రూ.45 వేలు, మూడో సంవత్సరం రూ.50 వేలు, నాలుగో సంవత్సరం రూ.55 వేలు ఉంటుంది. ఇక ట్రైనీ ఇంజినీర్లకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు. మూడో ఏడాది రూ.40 వేల గౌరవ వేతనం అందనుంది.

ABOUT THE AUTHOR

...view details