BEL Jobs 2023 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పలు విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ ఇంజినీర్, ప్రోజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది.
బెల్ సీనియర్ ఇంజినీర్ జాబ్స్
BEL Senior Engineer Recruitment : నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ 'బెల్' 24 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
- డిప్యూటీ మేనేజర్ - 05
- సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ - 19
విద్యార్హతలు
Senior Engineer Jobs Education Qualification : ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు ఆయా పోస్టులకు అనుగుణంగా పూర్వ అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి
Senior Engineer Jobs Age Limit : 2023 మే 01 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 36 ఏళ్ల గరిష్ఠ పరిమితి; సీనియర్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏళ్ల గరిష్ఠ పరిమితి విధించారు.
ఎంపిక విధానం
Senior Engineer selection process : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీనియర్ ఇంజినీర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ
ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 4లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా "మేనేజర్ (హెచ్ఆర్), ప్రోడక్ట్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (పీడీఐసీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావ్ రోడ్, నియర్ నాగాలాండ్ సర్కిల్, జలహల్లి పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా " చిరునామాకు తమ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.