BEL Jobs 2023 :ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) 95 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 36 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
బెల్-ఘజియాబాద్‌లో 95 వివిధ పోస్టులు..!
BEL Jobs :ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో ఖాళీగా ఉన్న 95వివిధ పోస్టుల( BEL Recruitment 2023 )ను భార్తీ చేసేందుకు అర్హుల నుంచి ఆగస్టు 22నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మొత్తం ఖాళీలు..
BEL Vacancy 2023 :95పోస్టులు.
పోస్టులు..
BEL Posts :ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్.
విభాగాలు..
హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ తదితరాలు.
విద్యార్హతలు..
BEL Qualification :ఆయాపోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమాల్లో ఉత్తీర్ణత సాధించాలి.
పని అనుభవం..
అభ్యర్థులకు కనీసం 0-2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఏజ్ లిమిట్..
- ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28ఏళ్లు మించకూడదు.
- ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 32ఏళ్లు దాటకూడదు.
జీతభత్యాలు..
BEL Salary :ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000-రూ.40,000, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000-రూ.55,000ల వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం..
BEL Recruitment Selection Process : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు..
- ప్రాజెక్ట్ ఇంజినీర్- రూ.400/-
- ట్రెయినీ ఆఫీసర్, ట్రెయినీ ఇంజినీర్- రూ.150/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది..
BEL Exam Apply Last Date :2023 సెప్టెంబర్ 07.
పరీక్షా తేదీ..
BEL Exam Date 2023 : సెప్టెంబర్ చివరివారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.