BEL Engineering Jobs 2023 :ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 232 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ప్రొబేషనరీ ఇంజినీర్ - 205 పోస్టులు
- ప్రొబేషనరీ ఆఫీసర్ (HR) - 12 పోస్టులు
- ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ - 15 పోస్టులు
విద్యార్హతలు
- అభ్యర్థులు ఆయా ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అనుగుణంగా.. బీఈ, బీటెక్, బీఎస్సీ చేసి ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ మెకానిక్/కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు రెండేళ్లు వ్యవధి గల.. ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ కోర్సులు చేసి ఉండాలి.
- ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సీఏ/ సీఎంఏ చేసి ఉండాలి.
వయోపరిమితి
- ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 1 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లకు మించి ఉండకూడదు.
- ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 1 నాటికి 30 ఏళ్లు లోపు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1180 చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.