BEL Apprentice Jobs 2024 : నవరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్' (BEL) 115 డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- మెకానికల్ ఇంజినీరింగ్ - 30 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ - 15 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 30 పోస్టులు
- సివిల్ ఇంజినీరింగ్ - 20 పోస్టులు
- మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ & సెక్రటేరియల్ ప్రాక్టీస్ - 20 పోస్టులు
- మొత్తం పోస్టులు - 115
ట్రేడ్ విభాగాలు
మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, టెలికమ్యునికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ & సెక్రటేరియల్ ప్రాక్టీస్
విద్యార్హతలు
BEL Apprentice Qualification : అభ్యర్థులు AICTE లేదా GOI గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో, ఆయా పోస్టులకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
BEL Apprentice Age Limit :
- అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 23 ఏళ్లు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనలను అనుసరించి, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి మినహాయింపులు లభిస్తాయి.
దరఖాస్తు రుసుము
BEL Apprentice Application Fee :అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.