Beijing Olympics Torchbearer: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని చైనాకు భారత్ తెగేసి చెప్పింది. ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా గల్వాన్ ఘటనలో గాయపడిన.. ఆ దేశ ఆర్మీ అధికారిని చైనా ఎంపిక చేసిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
"ఈ అంశంలో చైనా తీసుకున్న నిర్ణయం విచారకరం. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కాబోము."
- అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ప్రసారాలు ఉండవు..
మరోవైపు.. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను చేయబోమని డీడీ స్పోర్ట్స్ తెలిపింది. ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ ఈ మేరకు వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడ్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చిత్రహింసలకు చేసిన విషయాన్ని.. ఆ దేశ యంత్రాంగానికి తెలిపినట్లు భారత్ పేర్కొంది.
ఇదీ చదవండి:
వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా... గల్వాన్ లోయలో దెబ్బతిన్న కర్నల్
పాక్ సైనిక స్థావరాలపై ఉగ్రదాడి- 15 మంది ఉగ్రవాదులు హతం