Begumpet Fire Accident Today : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్‌లో సెలూన్‌లోని సిలిండర్ లీక్ అయి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు, కస్టమర్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం- నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు సజీవదహనం