Karnataka Beggar Died: కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర్కు సమీపంలో హృదయవిదారక ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో అందరి ఇళ్ల దగ్గర అడుక్కుంటూ తిని బతికే ఓ బిచ్చగాడు.. ఆహారం దొరక్క చనిపోయాడు. సమీప చెత్తకుప్పలో పడి ఉన్న అతడి మృతదేహాన్ని సగానికిపైగా వీధి కుక్కలు కొరికి తినేశాయి. బిచ్చగాడు చనిపోయి మూడు రోజులు అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
అభాగ్యుడి 'ఆకలి చావు'.. చెత్త కుప్పలోని శవాన్ని కుక్కలు తినేసి... - కర్ణాటక బిచ్చగాడి మరణం
Karnataka Beggar Died: ఏ దిక్కూ లేని ఓ బిచ్చగాడు.. ఆహారం దొరక్క చనిపోయాడు. చెత్తకుప్పలో పడి ఉన్న అతడి శరీరాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వీధి కుక్కలు సగానికి పైగా కొరికి తినేశాయి. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలో జరిగింది.
![అభాగ్యుడి 'ఆకలి చావు'.. చెత్త కుప్పలోని శవాన్ని కుక్కలు తినేసి... beggar died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14943113-thumbnail-3x2-ddd.jpg)
చనిపోయిన బిచ్చగాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త ఏరుకుని.. అడుక్కుని బతికేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆహారం దొరకకే మృతి చెందినట్లు భావిస్తున్నారు. చెత్తకుప్ప నుంచి విపరీతమైన దుర్వాసన రావడం వల్ల చూశామని, అతడు చనిపోయి మూడు రోజులు అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానిక స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బిచ్చగాడి వయసు 65 ఏళ్లకు పైగా ఉండొచ్చని.. ఇంకా అతడు ఎవరనేది తెలియదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాజస్థాన్ టు దిల్లీ.. 50గంటల్లో 350కి.మీ పరుగు.. ఆర్మీ అభ్యర్థి నిరసన!