గుజరాత్లో ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించాడు ఓ యాచకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఆరోగ్య భవన్‌కు సంబంధించిన ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించాడు. యాచకుడు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడిని సాహిల్ మక్కుద్ఖాన్ పఠాన్‌గా పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించిన యాచకుడు.. డీజిల్ అయిపోయేంత వరకు తిరిగి.. - గుజరాత్ ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించిన బెగ్గర్
ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించిన ఓ యాచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి ఇంతకు ముందు ఏదైనా నేరానికి పాల్పడ్డాడా? లేక ఈ దోపిడీలో డిపార్ట్మెంట్కు చెందిన వారెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.
ఈ వ్యక్తి ప్రభుత్వ భవనం వద్ద భిక్షాటన చేసేవాడు. ఈ యాచకుడు.. ఆరోగ్య అధికారుల కోసం ఉద్దేశించిన స్కార్పియో కారును దొంగిలించి, దానిలో వడోదరాకు పారిపోయాడు. అయితే, నదియాడ్ ప్రాంతానికి చేరుకోగానే వాహనంలో డీజిల్ అయిపోయింది. దీంతో అతడి వద్ద డబ్బులు లేక వాహనాన్ని అక్కడే వదిలేసి తిరిగి అహ్మదాబాద్ చేరుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పఠాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని గత రికార్డులను పరిశీలించిన పోలీసులు తదుపరి చర్యలను ప్రారంభిచారు. అతను ఇంతకు ముందు ఏదైనా నేరానికి పాల్పడ్డాడా? ఈ దోపిడీలో డిపార్ట్మెంట్కు చెందిన వారెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.