కేరళ పతనంతిట్ట జిల్లాలో నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి తిన్న బిర్యానీకి కోర్టు ఇప్పుడు పరిహారం ఇప్పించింది. కోర్టు ఖర్చులు సహా రూ.12వేలు పరిహారాన్ని చెల్లించాలని హోటల్ యజమాన్యాన్ని ఆదేశించింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.
అసలేమైందంటే..?

తిరువళ్లకు చెందిన శైలేష్ ఊమెన్.. 2017లో తన కుటుంబంతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ రాగానే ఆవురావురమంటూ.. తినడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే శైలేష్ నోటికి ఏదో గుచ్చినట్లు అనిపించింది. చూస్తే బీరు సీసా ముక్క కనిపించింది. వెంటనే హోటల్ యజమానికి సమాచారం అందించి.. ఆస్పత్రికి వెళ్లాడు. అప్పట్లో దీనిపై స్పందించిన హోటల్ యజమాని.. ఇలాంటివి జరగడం సాధారణమని వ్యాఖ్యానించాడు.
దీంతో హోటల్ యాజమాన్యంపై వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు శైలేష్. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. రూ.10,000 పరిహారంతో పాటు రూ.2,000 కోర్టు ఖర్చులకు కస్టమర్‌కు(శైలేష్) చెల్లించాలని హోటల్ యజమాన్యాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి:పెసర పునుగుల పులుసు.. రుచి చూశారా?