భర్తను.. రెండో భార్య దారుణంగా హత్య చేసిన ఘటన ఘటన కర్ణాటకలోని నేలమంగళలో సోమవారం జరిగింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి పలర్ స్వామి అలియాస్ స్వామి రాజ్ (50)గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం..
పలార్ స్వామికి 25 ఏళ్ల క్రితం సత్యకుమారి అనే మహిళతో వివాహమైంది. ఆరేళ్ల క్రితం ఓ బ్యూటిపార్లర్లో పనిచేసే నేత్రను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హరోక్యథనహల్లి అనే ప్రాంతంలో పలార్ స్వామి నేత్రతో నివాసముంటున్నాడు.
రెండో వివాహం తర్వాత కూడా పలార్ స్వామి తన మొదటి భార్య, పిల్లలు కలుస్తుండేవాడు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేవాడు. ఇటీవల పలార్ స్వామి తన మొదటి భార్య కుమార్తెకి స్కూటీ కొనిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నేత్ర.. భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. అనంతరం.. పోలీసులకు లొంగిపోయింది. పలార్ స్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. అందుకే అతడిని చంపేశానని వెల్లడించింది.
ఇదీ చూడండి :'ఆ చట్టాలను రద్దు చేయకపోతే..' కేంద్రానికి టికాయిత్ అల్టిమేటం