తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజ్​మహల్ వద్ద అందాల ప్రదర్శన.. 35 దేశాల సుందరీమణుల సందడి - తాజ్ మహాల్ లేటెస్ట్ న్యూస్

35 దేశాలకు చెందిన సుందరీమణులు ఉత్తర్​ప్రదేశ్​ అగ్రాలోని తాజ్​మహల్ వద్ద సందడి చేశారు. గంటపాటు కలియ తిరిగిన భామలు.. ఫ్యాషన్‌ ప్రదర్శనలు, ఆటపాటలతో సందర్శకులను అలరించారు.

miss worlds at taj mahal palace
తాజ్​మహల్ వద్ద సుందరీమణులు

By

Published : Oct 12, 2022, 9:31 PM IST

Updated : Oct 12, 2022, 10:56 PM IST

తాజ్​మహల్ వద్ద అందాల భామలు.. 35 దేశాల సుందరీమణులు హాజరు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజ్‌మహల్ వద్ద సందడి చేశారు అందాల భామలు. తాజ్‌ వద్దకు చేరుకున్న.. దాదాపు 35 దేశాలకు చెందిన సుందరీమణులు.. గంటపాటు అక్కడే కలియ తిరిగారు. ఫ్యాషన్‌ ప్రదర్శనలు, ఆటపాటలతో సందర్శకులను అలరించారు. విశ్వసుందరి పోటీల్లో పాల్గొనేందుకు ఆగ్రా వచ్చిన ఈ భామలు.. తాజ్​మహాల్ అందాలను ఆస్వాదించారు. తాజ్‌ మహల్​ను సందర్శించిన భామలు.. దాని చరిత్ర, పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం విశేషాలను తెలుసుకున్నారు.

తాజ్​మహల్ వద్ద సుందరీమణులు
తాజ్​మహల్ వద్ద సుందరీమణులు

అనంతరం తాజ్‌మహల్‌ ముందు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన పర్యాటకులంతా.. ఈ సుందరీమణులను ఆసక్తిగా తిలకించారు. మరోవైపు తాజ్​మహాల్​ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సెల్ఫీలు దిగేందుకు పర్యటకులు ఆసక్తి కనబర్చారు.

తాజ్​మహల్ వద్ద సుందరీమణులు
పొగమంచుతో కమ్ముకున్న తాజ్​మహల్
Last Updated : Oct 12, 2022, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details