గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ ఘనంగా జరిగింది. దేశ రాజధాని దిల్లీలోని విజయ్‌చౌక్‌లో కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల సంగీత బ్యాండ్లు ప్రదర్శన ఇచ్చాయి.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.