తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రం తాపత్రయమంతా ట్విట్టర్ బ్లూ టిక్స్​పైనే'

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై విమర్శలు చేశారు. బ్లూ టిక్స్​ కోసం కేంద్రం తాపత్రయపడుతోందని ట్వీట్ చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

By

Published : Jun 6, 2021, 2:15 PM IST

Updated : Jun 6, 2021, 4:16 PM IST

వ్యాక్సినేషన్​ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో వ్యాక్సిన్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రం మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్​ మార్క్​ కోసం తాపత్రయపడుతోందని ఎద్దేవా చేశారు.

"మోదీ ప్రభుత్వం ట్విట్టర్​ బ్లూ టిక్​ మార్క్ కోసం తాపత్రయపడుతోంది. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ కావాలనుకుంటే వారు సొంతంగా వ్యాక్సిన్ సంపాదించుకోవాలి(అత్మనిర్భర్ కావాలి)."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మోదీ సర్కారు ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయని అన్నారు రాహుల్.

శనివారం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు బ్లూ బ్యాడ్జీని తొలగించింది కేంద్రం. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కొద్ది గంటలనంతరం వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్​.

ఇదీ చదవండి:'పిజ్జాలే ఇస్తుంటే.. ఇంటికే రేషన్​ ఎందుకొద్దు?'

Last Updated : Jun 6, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details