తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత వాయుసేనకు ఆకాశ్ క్షిపణులు - బీడీఎల్ న్యూస్

భారత వైమానిక దళానికి ఆకాశ్​ క్షిపణులను అందించనుంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్). ఈ మేరకు రూ. 499 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

IAF, aksash missiles
ఆకాశ్ మిసైల్స్, వాయుసేన

By

Published : Jul 9, 2021, 5:56 AM IST

భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఒప్పందం చేసుకుంది. రూ. 499 కోట్ల విలువైన భారత వైమానిక దళం ఎయిర్ కమోడోర్ అజయ్ సింఘాల్, బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమోడోర్ టి. ఎన్. కౌల్ గురువారం దిల్లీలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీడీఎల్ సీఎండీ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్ర మాట్లాడుతూ భారత, వైమానిక దళానికి తమ సంస్థ ఆకాశ్ క్షిపణులను సరఫరా చేస్తుందని తెలిపారు.

విదేశాలకు ఎగుమతి చేసేందుకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. 2021-21 ఆర్థిక సంవత్సరంలో బీడీఎల్ రూ. 2,803 కోట్ల విలువైన ఆర్డర్లను పొందిందన్నారు. ఇందులో రూ.1,820 కోట్ల విలువైన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, రూ. 793 కోట్ల విలువైన ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల ఆర్డలు ఉన్నాయని వివరించారు.

ఇదీ చదవండి:అధునాతన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం

ABOUT THE AUTHOR

...view details