తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీర్పు 2021: అసెంబ్లీ పోరులో ఆధిపత్యం ఎవరిది? - అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

మార్చి 27న మొదలైన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ.. నెలరోజుల పాటు సాగి, ఏప్రిల్​ 29న జరిగిన బంగాల్​ ఎనిమిదో విడత ఎన్నికల ప్రక్రియతో ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని వివిధ సర్వే సంస్థలు పలురకాలుగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కౌంటింగ్​ ప్రక్రియ జరగనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

counting
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

By

Published : May 1, 2021, 10:01 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు ఆదివారం తేలనున్నాయి.

మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకుగాను 2.7 లక్షల పోలింగ్​ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళ పోరు...

తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకే కూటమి మధ్య ద్విముఖపోరు నడిచింది. మళ్లీ తామే అధికారాన్ని చేపడతామని ఏఐఏడీఎంకే ధీమాగా ఉండగా.. మరోవైపు.. ఈసారి తమిళ ఓటర్లు తమకే పట్టం కడతారని డీఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కమలహాసన్​, దినకరన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

234 సీట్లకు ఏప్రిల్​ 6న ఒకే విడతలో పోలింగ్​ జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.

తమిళనాడు ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు

తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే.. అధికార పీఠాన్ని అధిరోహించనుందని వెల్లడించాయి.

బంగాల్ దంగల్​​..

294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో సాగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది.. సర్వత్రా ఆసక్తిగా మారింది. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్​ దేశం సాక్ష్యంగా నిలిచింది.

బంగాల్​లో ఏ పార్టీ అయినా.. అధికారాన్ని చేపట్టేందుకు 148 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

బంగాల్​ ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు

బంగాల్​ గడ్డపై టీఎంసీ మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేరళ సమరం..

కేరళలో ఎల్​డీఎఫ్, ​యూడీఎఫ్​ హోరాహోరీ పోరులో అంతిమవిజయం ఎవరిదనేది ఆదివారం తేలనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఈ రెండు కూటములు​ ధీమాగా ఉన్నాయి.

మొత్తం 140 అసెంబ్లీ ఎన్నికలకు ఒక విడతలో పోలింగ్​ జరగ్గా.. 957మంది ఎన్నికల బరిలో నిలిచారు.

కేరళ ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు

కేరళలో మరోమారు పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ కూటమే.. అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు విడుదలైన అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

అసోం పోరు...

​భాజపా-ఏజీపీ, కాంగ్రెస్‌ మహాకూటమి, అసోం జాతీయ పరిషత్‌ మధ్య ప్రధానంగా పోటీ సాగిన ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి.

126 స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో.. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

అసోం ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు

అసోంలో.. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్​పోల్​ ఫలితాలు విడుదల చేసిన సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే.. అధికార కూటమికి ఈసారి గతం కంటే కొన్ని స్థానాలు తగ్గనున్నట్లు వెల్లడించాయి.

పుదుచ్చేరి పోరు..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో.. మొత్తం 30 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలన్నా.. 16 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

పుదుచ్చేరి ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details