తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోరాడాల్సింది కరోనాపై.. కాంగ్రెస్​పై కాదు'

దేశంలో ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాపైనేనని, కాంగ్రెస్​పై కాదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని మోదీ సర్కార్ గుర్తించాలని ట్వీట్ చేశారు.

Battle against Covid, not Congress: Rahul Gandhi
'పోరాడాల్సింది కరోనాపై.. కాంగ్రెస్​పై కాదు'

By

Published : Apr 27, 2021, 2:55 PM IST

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ప్రస్తుతం పోరాడాల్సింది కొవిడ్​పై మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీపై కాదని చురకలంటించారు. "ప్రస్తుత పోరాటం కరోనాపైనేనని, కాంగ్రెస్ కానీ.. ఏ ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కాదనేది మోదీ ప్రభుత్వం గుర్తించాలి" అంటూ ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్

కరోనా నియంత్రణలో కేంద్రం అసమర్థంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ఆక్సిజన్ పడకలు, అత్యవసర ఔషధాలకు తీవ్ర కొరత ఉందని చెబుతోంది.

ఈ మేరకు పార్టీ తరపున సహాయ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు పీసీసీ కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసింది. వీటిని సమన్వయం చేసేందుకు ఏఐసీసీ కంట్రోల్​ రూం ఏర్పాటుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవలే ఆమోదం తెలిపారు.

ఇదీ చదవండి-స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి

ABOUT THE AUTHOR

...view details