తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది! - Bathroom Cleaning tips

Bathroom Cleaning Tips in Telugu : బాత్​ రూమ్ క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఎంత క్లీన్ చేసినా దుర్వాసన అలాగే ఉంటోందా? అయితే.. మేము చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ బాత్ రూమ్ తళతళా మెరిసిపోవడం గ్యారెంటీ!

Bathroom Cleaning Tips in Telugu
Bathroom Cleaning Tips in Telugu

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 4:41 PM IST

Bathroom Cleaning Tips in Telugu : బాత్ రూమ్ క్లీనింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుభ్రపరిచిన వెంటనే మురికిగా అవుతూ ఉంటుంది. క్లీన్ చేయడం కాస్త ఆలస్యమైతే చాలు.. మూలలన్నీ జిడ్డుగా మారిపోతాయి. పైగా కొన్ని బాత్ రూమ్ క్లీనర్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింట్లో హానికారక రసాయనాలు ఉంటాయట. కాబట్టి.. వెనిగర్​తో క్లీన్ చేయడం అనేది బెటర్ ఆప్షన్​గా చెబుతున్నారు.

బాత్ రూమ్ సింక్..

ఒక గిన్నెలో, వైట్ వెనిగర్, నీటిని సమానంగా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఆ తర్వాత.. ఈ లిక్విడ్​ను బాత్రూమ్ సింక్, సోప్ డిస్పెన్సర్‌, హోల్డర్‌లపై స్ప్రే చేయాలి. ఇప్పుడు కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్పాంజితో సున్నితంగా స్క్రబ్ చేయాలి.

బాత్ రూమ్ అద్దాలు..

బాత్​ రూమ్ అద్దాలను క్లీన్ చేయడానికి కూడా.. వెనిగర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక బౌల్​ లో వెనిగర్, నీటిని ఈక్వల్​గా తీసుకోవాలి. ఆ ద్రావణంలో శుభ్రమైన ఇంకా స్మూత్​గా ఉండే క్లాత్ ముంచి.. అద్దాలను క్లీన్ చేయాలి. ఆ తర్వాత అద్దంపై ఎలాంటి గీతలూ ఉండకూడదనుకుంటే.. ఓ న్యూస్ పేపర్ తీసుకొని స్మూత్​గా అద్దాలపై రుద్దాలి.

గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!

కుళాయిలు..

కుళాయిలు క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ వస్త్రాన్ని వెనిగర్‌లో ముంచి, ఒక గంటపాటు కుళాయి చుట్టూ చుట్టాలి. లేదంటే.. రాత్రి మొత్తం ఉంచినా సరిపోతుంది. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచేస్తే చాలు. కుళాయిలు మెరిసిపోతూ కనిపిస్తాయి. వెనిగర్‌లో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కుళాయిలపై పేరుకుపోయిన మురికిని విచ్ఛిన్నం చేస్తుంది.

అట్టుకట్టిన సబ్బు మరకలు..

బాత్ రూమ్​లో సబ్బు పెట్టే చోట సబ్బు మరకలు అట్టుకట్టిపోతాయి. దీంతో మీ బాత్ రూమ్ అపరిశుభ్రంగా కనిపిస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది. దీన్ని క్లీన్ చేయడానికి వెనిగర్, డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను సమాన భాగాలుగా తీసుకొని లిక్విడ్ తయారు చేయాలి. దీనిలో స్పాంజ్ ముంచి ఎక్కడెక్కడ మరకులు ఉన్నాయో.. అక్కడ క్లీన్ చేయాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత.. స్మూత్​గా స్క్రబ్ చేసి, నీటితో శుభ్రం చేసుకోవాలి.

టాయిలెట్ బౌల్ కూడా..

టాయిలెట్ సీట్.. బౌల్ క్లీన్ చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా కాంబో బాగా పని చేస్తుంది. టాయిలెట్ బౌల్ మీద ఒక కప్పు వెనిగర్ పోసి, సుమారు 10 నిమిషాలు ఉండనివ్వాలి. ఆ తర్వాత కప్పు బేకింగ్ సోడా చల్లాలి. కాసేపటి తర్వాత మరో కప్పు వెనిగర్ వేయాలి. మరో 10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత టాయిలెట్ బ్రష్‌ తో స్క్రబ్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది. 2017లో "Journal of Applied Microbiology"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే కాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్ పెరుగుదలను వెనిగర్ ఎఫెక్టివ్​గా నిరోధిస్తుందట. తడిగా ఉన్న బాత్రూమ్ పరిసరాలలో.. శిలీంధ్రాల పెరుగుదలనూ అడ్డుకుంటుందట.

"ఛీ.. ఛీ.. ఏందిరా ఈ ఛండాలమూ..?" ఉద్యోగుల టాయిలెట్లో.. సీసీ కెమెరాలు!

ABOUT THE AUTHOR

...view details