తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.3,000 కోసం తండ్రిని చంపి ఆరు ముక్కలుగా చేసిన కుమారుడు! - బంగాల్​ ఉత్తర 24పరగణాలు హత్య కేసు

ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్​ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్​ మాదిరిగానే ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఆరు ముక్కలుగా చేసి అక్కడక్కడా పడేశాడు. ఈ దారుణం నవంబర్​ 12న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Baruipur Murder case
తండ్రిని చంపి ఆరు ముక్కలుగా చేసిన కుమారుడు

By

Published : Nov 23, 2022, 7:44 PM IST

బంగాల్​ దారుణమైన ఘటన వెలుగు చూసింది. శ్రద్ధా వాకర్​ను అఫ్తాబ్​ హత్య చేసిన విధంగానే.. ఓ యువకుడు తన తండ్రిని చంపాడు. ఆ మృతదేహాన్ని ఆరు ముక్కలుగా చేసి.. వివిధ ప్రాంతాల్లో పడేశాడు. డబ్బు విషయంలో గొడవ పడిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనలో నిందితుడి తల్లితో పాటుగా.. మరికొంత మంది హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్​ 12న ఈ దారుణం జరగగా.. తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం..
ఉత్తర 24పరగణాలు జిల్లాలోని బరుయిపుర్​ ప్రాంతంలో ఉజ్జ్వల్​ చక్రవర్తి అనే మాజీ నేవీ ఉద్యోగి.. తన కుమారుడు జాయ్​ చేతిలో హత్యకు గురయ్యాడు. జాయ్​ ప్రస్తుతం వడ్రంగి పనికి సంబంధించి ఓ ప్రత్యేక కోర్సులో డిప్లొమా చదువుతున్నాడు. నిత్యం తండ్రీకొడుకుల మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగేది. నవంబర్​ 12న జాయ్​ తన తండ్రితో రూ.3,000 కోసం గొడవ పడ్డాడు. కోపంతో తన వద్దనున్న రంపంతో తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లి సహాయంతో మృతదేహాన్ని ఆరు ముక్కలుగా చేశాడు. అనంతరం ఆ భాగాలను ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి.. సైకిల్​ మీద తీసుకువెళ్లి ఖాస్​మల్లిక్, దేహిమెదన్ మల్లా అనే ప్రాంతాల్లో అక్కడక్కడా పడేశాడు.

స్థానికులు నవంబర్ 18న చెరువులో కొన్ని శరీర భాగాలను గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ శరీర భాగాలు ఉజ్జ్వల్​వని గుర్తించారు. ఉజ్జ్వల్​ భార్య, కుమారుడిపై అనుమానంతో పోలీసులు వారిని విచారించగా.. జాయ్​నే ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేయడానికి రంపాన్ని ఉపయోగించినట్లు జాయ్​ తెలిపాడు. ఈ కేసులో తల్లి, కుమారుడితో పాటు మరికొంత మందికి ఇందులో ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తల్లి, కుమారుడి ఫోన్​ డేటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

స్థానికులు వాదన ఇలా.. ఉజ్జ్వల్​ కుటుంబానికి స్థానికంగా ఎవరితోనూ మంచి సంబంధాలు లేవని.. జాయ్​కు అతని తండ్రి చిన్నప్పటి నుంచే కరాటేలో శిక్షణ అందించారని స్థానికులు తెలిపారు. జాయ్ మాత్రం చిన్నప్పటి నుంచే స్నేహితులతో గొడవపడి.. అల్లర చిల్లరగా తిరిగే వాడని చెప్పారు. తండ్రీకొడుకులు అప్పుడప్పుడు డబ్బులు కోసం గొడవ పడే వారు కానీ.. జాయ్​నే ఈ హత్య చేశాడంటే ఆశ్చర్యంగా ఉందని కొందరు స్థానికులు అంటున్నారు. ఇరుగుపొరుగు వారు మాత్రం ఈ హత్య జాయ్​ ఆవేశంలో చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details