Minor Gang Rape: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మార్కెట్‌కు కూరగాయలు కొనుక్కునేందుకు వెళ్లిన ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసి.. ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం..ధోల్‌పుర్ జిల్లాలో బారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జులై 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లింది. అదే సమయంలో ఓ యువకుడు.. తన బైక్‌పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక కుటుంబసభ్యులు తమ కుమార్తె కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు ఉదయం ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఫిర్యాదు..
హరియాణాలోని పానీపత్కు చెందిన ఓ వివాహిత.. తన అత్తమామలు, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి తనను తీవ్రంగా వేధిసున్నారని ఆరోపించింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత మరింతగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.