Baramulla encounter: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడ్నీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు నిఘా వర్గాలకు గురువారం సమాచారం అందింది. దీంతో సాయుధ దళం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. బలగాలపై ముష్కరులు తొలుత కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారు.