తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బెయిల్‌ లభించిన వారి హక్కులకు భంగం కలిగించొద్దు'

కోర్టుల నుంచి బెయిల్ లభించిన వారు.. విడుదల అయ్యేందుకు ఉన్న హక్కులకు భంగం కలిగించొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర బార్​ కౌన్సిళ్లకు బీసీఐ సంయుక్త కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాండే లేఖ రాశారు.

bar council of india
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

By

Published : Apr 29, 2021, 6:37 AM IST

చట్టప్రకారం కోర్టుల నుంచి బెయిల్‌ లభించిన వారు విడుదలయ్యేందుకు ఉన్న హక్కులకు భంగం కలిగించొద్దని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు, బార్‌ అసోసియేషన్లకు.. బీసీఐ సంయుక్త కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాండే లేఖ రాశారు.

కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు, బార్‌ అసోసియేషన్లు, న్యాయవాదులు, క్లర్కులు కోర్టుల ముందు హాజరయ్యేందుకు అనుమతించని విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. న్యాయవాదులు, వారి కుటుంబాల రక్షణ కోసం తీసుకున్న ఈ జాగ్రత్తల విషయంలో తాము జోక్యం చేసుకోమని పేర్కొన్నారు. అదే సమయంలో బెయిల్‌ లభించిన వారికి సంబంధించిన బెయిల్‌ బాండ్లు, ష్యూరిటీలు సమర్పించేందుకు న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అలా చేయకపోతే బెయిల్‌ లభించిన వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'వైద్య సదుపాయాలపై సమగ్ర వివరాలివ్వండి'

ABOUT THE AUTHOR

...view details