ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె జరపాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం. పెట్టుబడుల ఉపసంహరణల్లో ప్రభుత్వ దూకుడు స్వభావం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై చర్చించాము. ఐడీబీఐతో సహా రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకణ, ఎల్ఐసీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ఇన్సురెన్స్ రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్యనం వంటి అంశాలపై సమావేశంలో మాట్లాడాం. ప్రభుత్వ తిరోగమన చర్యలను వ్యతిరేకించాలని నిర్ణయించాం.