తాను పనిచేసిన బ్యాంకులోనే దోపిడీకి యత్నించి, ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఓ మాజీ మేనేజర్. ఈ ఘటన మహారాష్ట్ర, పాల్ఘడ్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో జరిగింది.
పథకం ప్రకారం..
విరార్(ఈస్ట్) బ్రాంచ్ ఐసీఐసీఐ బ్యాంకులో గతంలో మేనేజర్‌గా పనిచేశాడు అనిల్ దూబే. బ్యాంకు మూసివేత సమయం, ఉద్యోగులు లేని సమయాలు తెలుసు కాబట్టి.. మరొకరితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో దోపిడీకి యత్నించాడు. అడ్డుకున్న మేనేజర్ యోగితా వర్తక్‌ను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటనలో క్యాషియర్ శ్వేతా దేశ్‌ముఖ్ సైతం తీవ్రంగా గాయపడ్డారు.