బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. 2023 సంవత్సరానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 546 ఉద్యోగ ఖాళీలు ఉండగా.. వీటిలో అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులు 500, ప్రైవేటు బ్యాంకర్ 15; వెల్త్ స్ట్రాటజిస్ట్ 19 సహా పలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 22న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 14తో దరఖాస్తులకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, ఇతర ముఖ్యమైన తేదీల సమాచారం మీకోసం..
భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. ఇది తన వెల్త్ మేనేజ్మెంట్ సేవలను విస్తరించడానికి అర్హతగల అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. వెల్త్ మేనేజ్మెంట్ ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపులు ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి వచ్చాయి. మార్చి14న దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఛాలెంజ్‌తో కూడిన, ఉన్నతమైన ఉద్యోగాన్ని చేయాలనుకునేవారికి ఇదొక చక్కటి అవకాశం. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన అక్విజిషన్ ఆఫీసర్, ప్రొడక్ట్ మేనేజర్,ఇతర పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చు.
- బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ ముఖ్యమైన తేదిలు
- నోటిఫికేషన్ విడుదలైన తేది: 2023, ఫిబ్రవరి 22
- దరఖాస్తు ప్రారంభ తేది: 2023, ఫిబ్రవరి 22
- దరఖాస్తుకు చివరి తేది: 2023, మార్చి 14
- పరీక్ష తేదీ: త్వరలో వెల్లడిస్తారు
- ఖాళీల వివరాలు
- బ్యాంక్ ఆఫ్ బరోడా అక్విజిషన్ మేనెజర్, ప్రొడక్ట్ మేనెజర్ కోసం 546 ఖాళీలకు గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- దీనిలో అక్విజిషన్ మేనేజర్ 500 పోస్టులు
- ప్రొడక్ట్ మేనెజర్ పోస్టులు 46
అర్హత గల అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. వివిధ నగరాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అయితే, ఎప్పటికప్పుడు బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా పోస్టింగ్ స్థలాన్ని మార్చే హక్కు బ్యాంక్‌కి ఉంది.
- జీతభత్యాలు
- మెట్రో నగరాలలో పని చేసే వారికి: సంవత్సరానికి రూ.5లక్షలు
- నాన్ మెట్రో సిటీస్ పని చేసే వారికి: సంవత్సరానికి రూ.4లక్షలు
ఈ ఉద్యోగంలో స్థిర జీతాలు కాకుండా అభ్యర్థులకు ఉన్న అర్హత ప్రమాణాలు, వారి పనితీరు, బ్యాంక్‌లో పనిచేసిన కాల పరిమితి, వారు పూర్తి చేసిన టార్గెట్లను బట్టి వారికి అదనపు భత్యాలు ఉండే అవకాశం ఉంటుంది.
- దరఖాస్తు రుసుము
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ.100లు చెల్లించాలి.
- ఎంపిక విధానం:
- షార్ట్‌లిస్టింగ్/ ఆన్‌లైన్ టెస్ట్, బృంద చర్చలు/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా
- ఆన్‌లైన్ పరీక్షలో భాగంగా రీజనింగ్, ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.