Bank Note Press Jobs 2023 :కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో.. 111 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ సహా వివిధ జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. (Bank Note Press Jobs 2023) ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
Bank Note Press Vacancy : 111 పోస్టులు
ఈ పోస్టుల వివరాలు
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ -4
- సూపర్‌వైజర్ (కంట్రోల్) -3
- సూపర్‌వైజర్ (ప్రింటింగ్) -8
- సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) -1
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) -25
- జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) -27
- జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ) -15
- జూనియర్ టెక్నీషియన్ (సివిల్/ ఎన్విరాన్‌మెంట్) -1
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్) -3
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) -4
వయోపరిమితి
Bank Note Press Jobs Age Limit : 18-30 ఏళ్లు. నిబంధనల ప్రకారం ప్రతి పోస్టుకు ఏజ్ లిమిట్‌ను నిర్ణయించారు.
విద్యార్హతలు..
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. హిందీలో 30 పదాలు, ఇంగ్లీష్‌లో నిమిషానికి 40 పదాలు చొప్పున కంప్యూటర్‌లో టైప్ చేయగలగాలి.
- సూపర్‌వైజర్ (కంట్రోల్) - ప్రింటింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. లేదంటే సంబంధిత విభాగంలో బీటెక్/ బీఈ, బీఎస్ఈ ఇంజినీరింగ్ చేసినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
- సూపర్‌వైజర్ (ప్రింటింగ్) - ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ చేసినవార కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - ఐటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. లేదంటే బీటెక్/ బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - హ్యాండ్ కంపోజింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) - ప్రింటింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ) - అటెండెంట్ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్ ట్రేడ్, మెషినిస్ట్ గ్రైండర్‌ట్రేడ్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ (సివిల్/ ఎన్విరాన్‌మెంట్) - ఐటీఐ వెల్డర్ సర్టిఫికెట్, సివిల్ (వెల్డర్) డిప్లొమా అర్హత ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్) - ఐటీఐ ఫిట్టర్ సర్టిఫికెట్ లేదా మెకానికల్ (ఫిట్టర్) డిప్లొమా పాసై ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - ఐటీఐ ఎలక్ట్రికల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్టిఫికెట్ లేదా ఎలక్ట్రికల్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
గరిష్ఠ వయోపరిమితి..
- ఎస్సీ, ఎస్టీలు - 5 ఏళ్లు
- ఓబీసీలు - 3 ఏళ్లు
- దివ్యాంగులు - 10 నుంచి 15 ఏళ్లు
- ఎక్స్-సర్వీస్‌మెన్ - 3 నుంచి 8 ఏళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.
- డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు..
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు- రూ.200/-
- ఇతరులు- రూ.600/-
దరఖాస్తుకు చివరి తేదీ..
Bank Note Press Jobs Last Date To Apply : 2023 ఆగస్టు 21.
పరీక్ష విధానం..
ఆన్లైన్లో-ఆబ్జెక్టివ్ టైప్ తరహాలో పరీక్ష నిర్వహిస్తారు.