తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపిన ముష్కరులు - Jammu kashmir terrorist attak

Jammu kashmir Bank Employee: జమ్ముకశ్మీర్​లో ఓ బ్యాంకు మేనేజర్​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలపాలై చనిపోయారు. మరోవైపు, షోపియాన్​ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రవాదులు కాల్పుల్లో మృతి చెందిన బ్యాంకు మేనేజర్​
ఉగ్రవాదులు కాల్పుల్లో మృతి చెందిన బ్యాంకు మేనేజర్​

By

Published : Jun 2, 2022, 11:56 AM IST

Updated : Jun 2, 2022, 1:26 PM IST

బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపిన ముష్కరులు

Jammu kashmir Bank Employee: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. కుల్గామ్‌ జిల్లా మోహన్​పొరాలో బ్యాంకు మేనేజర్​ విజయ్​కుమార్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. అక్కడకు చేరుకొని ముష్కరుల కోసం వేట ప్రారంభించారు.

ఉగ్రవాదులు కాల్పుల్లో మృతి చెందిన బ్యాంకు మేనేజర్​

రాజస్థాన్​కు చెందిన విజయ్​కుమార్​.. కశ్మీర్​లోని మోహన్​పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్​ మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు గురువారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో టీవీ నటి, టీచర్​ను కాల్చిచంపిన ముష్కరులు.. ఇప్పుడు బ్యాంకు మేనేజర్​పై దాడి చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు.. జమ్ముకశ్మీర్​లో గురువారం మరో ఘటన జరిగింది. షోపియాన్​ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు కశ్మరీ జోన్​ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇది గ్రనేడ్ దాడా..? లేకపోతే బ్యాటరీ పేలిందా..? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.

Last Updated : Jun 2, 2022, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details