Central Bank of India Notification 2023 : బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశించే అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 15లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా.. మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ -2 మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
మేనేజర్ స్కేల్ II (మెయిన్‌స్ట్రీమ్) : 1000 పోస్టులు
విద్యార్హతలు
bank job eligibility : అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫై అయ్యుండాలి. అలాగే సీఏఐఐబీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంత కంటే హైయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది.
పని అనుభవం :అభ్యర్థులకు పీఎస్బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా పీఎస్బీ/ ప్రైవేట్ సెక్టార్/ ఆర్ఆర్బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవం సహా సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
bank job age limit : అభ్యర్థుల వయస్సు 2023 మే 31 నాటికి 32 ఏళ్లు మించరాదు. అలాగే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు కూడా వర్తిస్తాయి.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతం ఇస్తారు.
పోస్టింగ్ ఏరియా
ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
Bank job selection process : ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
పశ్నాపత్రంలో వంద మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రెజెంట్ ఎకనామిక్ సినారియో, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
bank job exam fee : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.175 చెల్లించాలి. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 జులై 1
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :2023 జులై 15
- ఆన్లైన్ పరీక్ష తేదీ : 2023 ఆగస్టు రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహిస్తారు.