Bank Jobs 2023 : బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలని అభిలషించే అభ్యర్థులకు గుడ్ న్యూస్. నైనిటాల్ బ్యాంకు 110 క్లర్క్, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో (Nainital Bank Recruitment 2023)దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
Nainital Bank Job Vacancy :
- క్లర్క్ - 50 పోస్టులు
- మేనేజ్మెంట్ ట్రైనీ (MT) - 60 పోస్టులు
విద్యార్హతలు
Bank Job Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్‌లో అనుభవం ఉండాలి.
వయోపరిమితి
Bank Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 జూన్ 30 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
పేస్కేల్
Nainital Bank Clerk Pay scale :
- నైనిటాల్ బ్యాంకులోని మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000 చొప్పున అందిస్తారు.
- క్లర్క్ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారికి రూ.19,900 నుంచి రూ.47,920 వరకు పేస్కేల్ ఉంటుంది.
ఎంపిక విధానం
Nainital Bank Selection Process :అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
Nainital Bank Application Process :అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా https://www.nainitalbank.co.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో క్లర్క్ అండ్ ఎంటీ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. తరువాత దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి, దరఖాస్తును మరోసారి పూర్తిగా సరిచూసుకొని.. సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్అవుట్ను తీసుకొని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
Nainital Bank Notification Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ :2023 ఆగస్టు 05
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 27
- ఆన్లైన్ పేమెంట్‌కు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 27
- పరీక్ష తేదీలు : 2023 సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉంది.
నోట్ : ఒక వేళ పరీక్ష తేదీలో ఏమైనా మార్పులు చేస్తే.. ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందిస్తారు.